నా కొత్త సంవత్సర తీర్మానాలు
- జీవితంలో మళ్ళీ ఎప్పుడూ నిద్రమాత్ర ,
ఆముదం ఒకేసారి పుచ్చుకోకూడదు.
- మెదడుని భద్రంగా సంచిలో పెట్టి, ఆ
సంచిని బీరువాలో పెట్టి తాళం వేసిన తర్వాతగాని తెలుగు సినిమాలు చూడకూడదు.
- పదహారేళ్ళ హీరో, అరవయ్యేళ్ళ హీరోయిన్ తో
డ్యూయెట్లేసుకునే చిత్రరాజములను అస్సలు చూడకూడదు.
- వార్తా విశేషాలు చదివేముందు
తప్పనిసరిగా, గుర్తుగా గోడ మీద రాసుకునైనా సరే రక్తపోటు మాత్ర వేసుకోవాలి.
- వ్యాయామం చేయాలనిపించినప్పుడల్లా.......
ప్రెండోడి బొజ్జకన్నా మనది చిన్నదేలే అని
సరిపెట్టుకుని నిద్రపోకుండా.... కనీసం రెండు బస్కీలైన తీయాలి.
- మన ఆపానవాయువుకి పక్కోణ్ణి బాధ్యుడ్ని
చేయకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నించాలి.
- అంతర్జాల విహారం ఐదు గంటలనుండి ......
ఐదొందల నిముషాలకి తగ్గించాలి.
- ఫేసుబుక్ లో అమ్మాయిల ఫొటోలకి
మొహమాటానికి లైకులు కొట్టడం తగ్గించాలి.
- బ్లాగులో పోస్ట్ వేసిన తర్వాత ఎవరైనా
చూసారా లేదా అని అస్తమానూ చెక్ చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నించాలి.
bagundi funnyga.
ReplyDeleteథాంక్స్ :)
Delete