Wednesday, November 4, 2009

మా ఊరు

పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో, భీమవరానికి దగ్గరలో ఒక ప్రశాంతమైన పల్లెటూరు మా ఊరు. ఆయ్! ఎంతయినా మా గోదావరి జిల్లాల వాళ్ళకు కూసింత మర్యాద ఎక్కువేనండి. మా ఊరికి వెళ్ళాలంటే ఎర్ర బస్సే దిక్కు. కాని ఈ మద్య సెల్ ఫొన్ ప్రభావం తో కాస్త కమ్యూనికేషన్స్ పెరిగినమాట వాస్తవమే. మా ఊరికి నాకు మధ్య విడదీయరని అనుబంధమే చాలానే ఉంది. నా మరుపు రాని, ఆహ్లదకరమైన చిలిపి బాల్యం, ఇంటర్మీడియట్ వరకు మనం వెలగబెట్టిన చదువు, ఇంకా యెన్నొ వెల కట్టలేని అనుభూతులకు సజీవ సాక్ష్యం మా ఊరు. అందుకే ఎప్పుడైనా మా ఊరు గుర్తుకు రాగానే మనస్సంతా అనంద సాగరం లొ చిందులేస్తుంది. చిన్నప్పటి ఆటలు, కాలువలొ ఈతలు, జామ కాయల దొంగతనాలు, గేదె మీద స్వారి, స్నెహితులతొ గొడవలు, నాన్న తిట్లు...... ఇలా ఒక్కటేమిటి అనేక అనుభవాలు, చిలిపి చేష్టలు, తీపి గురుతులు.
నేను కనపడని ఆ దైవానికి మొక్కుకునేది ఒక్కటే, కనీసం సంవత్సరంలొ ఒక సారైన మా ఊరు వెళ్ళి మా ఊరిని, బంధు మిత్రులందరని పలకరించే అవకాశం ఇమ్మని. ఎందుకంటే, ఈ బిజీ జీవితంలొ, ఉద్యొగమనే రాట్నంలొ పడి మనలొ చాలా మంది పుట్టిన ఊరుని, కావాల్సిన వారిని మర్చిపోతున్నారు. నేను వారిలొ ఒకడిని కాకూడదని ఒక చిన్ని అశ.

13 comments:

  1. ఇంతకీ మీదే వూరు?

    ReplyDelete
  2. ఆయ్...........మాది కూడా ప.గో.జిల్లాయే నండి.మీది డెల్టా అండి,మాది మెట్ట అండి.ఐనా ప.గో.జిల్లా.యేకదా.కూడలిలో మన ప.గో.జిల్లావాళ్ళను కలవడం చాలా ఆనందంగా ఉంది

    ReplyDelete
  3. i born at Nidadavole in 1960 ప.గో.జిల్లాయే

    ReplyDelete
  4. మాది కూడా ప.గో. జిల్లానేనండి. ఆయ్!
    ఇంతకీ మీదే ఊరు?

    ReplyDelete
  5. :) మాది కూడా గోదావరి జిల్లానేనండి

    ReplyDelete
  6. నేను ఆయ్ అ౦డోయ్!!కాకపోతే గోదావరి ఆపక్క ..మెట్టినిల్లు,పుట్టినిల్లు అన్ని.. బాగున్నాయి మీ ఊరి కబుర్లు..కొ౦చ౦ వివర౦గా రాయల్సి౦ది.ప్లీజ్ ఈ వర్డ్ వెరిఫికేషన్ తీసేయ౦డి

    ReplyDelete
  7. @ మ.ప @ బ్రహ్మ్మి మాది రాయకుదురు, మా ఊరు మీకు తెలుసా?

    @ నాని
    @ జా.క
    @ నేస్తం

    నాకు మహదానందంగా ఉంది మన గోదావరి జిల్లాల వాళ్ళని కూడలి లో కలిసినందుకు.

    @ సుభద్ర మీ సూచనలకు ధన్యవాదములు.

    అందరకీ విన్నపం , తెలుగులొ వ్యాఖ్యలు చేయడానికి లేఖిని కాకుండా వేరే టూల్స్ అందుబాటులొ ఉంటే తెలియజేయగలరు.

    ReplyDelete
  8. మా ఊరు గోదావరి దగ్గర కాదు, కాలాస్త్రి (శ్రీకాళహస్తి).

    ReplyDelete
  9. @ శ్రీ
    కానీ తెలుగు వారే కదా :)

    ReplyDelete
  10. రాయకుదురు ఊరు తెలుసుకాని ,అటువైపు ఎప్పుడురాలేదు. మాది దేవరపల్లిదగ్గర గాంధీనగరం.

    ReplyDelete
  11. యాండోయ్....ప .గో ...వాళ్ళేనా అంతా ...మా తూ .గో వాళ్ళని కలుపుకోరా ఏంటీ ......:)

    ReplyDelete
  12. @ పరిమళం
    ఆయ్! తూ.గో. వారు మీరు నా టపా సరిగ్గా చదవలేదనుకుంటా. నేను మా గోదావరి జిల్లాల వాళ్ళు అని రాసానండీ, జిల్లా వాళ్ళు అని కాదు. ఎంతైనా అక్కచెళ్ళెల్లాంటి రెండు జిల్లాలను వేరు చేసి రాయడం భావ్యం కాదు కదండీ. :)

    ReplyDelete
  13. రాయకుదురు ఎందుకు తెల్దండి బాబు.. మేము ఆ చుట్టుపక్కల పుట్టిపెరిగినొళ్ళమే కదా.. మన సుబద్ర గారు చెప్పినట్టు కాస్త వివరంగా మీ ఊరు విశేషాలు రాయండి

    ReplyDelete

వినదగు నెవ్వరు చెప్పిన!
సందర్శకులందరకీ హృదయపూర్వక ధన్యవాదములు.

Thanks for stopping by. I would love to hear about your thoughts and welcome healthy discussions. But please do not use profane or abusive language.