Saturday, December 8, 2012

నేనెందుకు డాక్టర్ని కాకూడదు?





మా నాన్నగారు మా చిన్నప్పుడు ఆకులు అలములుతో నాటు వైద్యం చేసేవారు మంచి పేరు కూడా గడించారు. ఆ స్ఫూర్తితో నాకు డాక్టర్ అవ్వాలనే ఒక దురద పుట్టింది.  దురద పుడితే గోక్కోవాలి కదా!

డాక్టర్ అవ్వడానికి నీకున్న అర్హతలేంటి! అని బుర్ర తక్కువ ప్రశ్నలు అడగవద్దు.

మీరంతా చిన్నప్పుడు సైన్సు చదివే ఉంటారు కదా! కాబట్టి వైద్యం మా వంశపారంపర్యంగా నాకు జీన్స్ ద్వారా... అంటే మీరనుకునే బ్లూ జీన్స్ కాదు.. జన్యు కణాల ద్వారా వచ్చిందన్నమాట. 

అరే!... అలా... ఎలా అవుతుందిరా భాయ్! అని క్వశ్చన్ మార్క్ ఫేసులు పెట్టకండి. మా నాన్న తర్వాత నేనే ముఖ్యమంత్రి అని కారాగార విడిదిగృహం నుండి అద్భుతమైన స్కెచ్ లు గీస్తున్నా ఆ (సాక్షి వారి)  మహానేత కొడుకు మన యువనేత జగన్నన్న, దేశానికే యువరాజు, కాబోయే ప్రధానమంత్రి అని కాంగ్రెస్ వారిచే దండోరా వేయబడుతున్న రాహుల్ గాంధీ గారు, ఈ మధ్యనే తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన అఖిలేష్ యాదవ్ గారు, ఇంకా చిన్నా చితకా ఎం.ఎల్.ఎ లు; ఎం.పిలుగా స్థిరపడ్డ మన నాయకుల పుత్ర రత్నాలే నాకు ఆదర్శం.

ఏమయ్యా! ప్రొద్దునే మీ పక్క అపార్ట్ మెంట్లో ఉన్న బెల్ట్ షాప్ కి  గాని వెళ్ళావా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావ్! దానికి దీనికి ఏమిటి సబంధం? ఇది ప్రాణాలతో పని.  రాజకీయంలో కొంచెం అనుభవం వస్తే వాళ్ళు కూడా బాగానే చేయొచ్చు కదా?

ప్రాణాలు? ఎవరివి? నీలోఫర్ హాస్పిటల్ లో  పోయే పసిగుడ్డులవా? బతికే దారిలేక ఆత్మహత్యలకు పాల్పడే అమాయక రైతులవా? లేక భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో పోయినవాళ్ళవా! 

అనుభవమా? నేను కూడా అదే చెప్ప్తున్నానండి. నేను కూడా రెండో మూడో బడుగు ప్రాణుల్ని హారీమనిపించాకా నేర్చుకుంటాను. దాంట్లో తప్పేముంది. కోట్ల మందిని పాలించే పాలకులకి ఒక న్యాయం నాకొక న్యాయమా? మనది ఎలాగూ రాచరిక ప్రజాస్వామ్యమే కదా?  పైపెచ్చు.. మన కర్మ సిద్ధాంతం ప్రకారం నేను ఒక వాహకం మాత్రమే! ఆ పోయే బక్క ప్రాణులు... వారి ఫూర్వ జన్మ పనుల వలననే కదా పోతారు. అయినా, వంద కోట్ల పై చిలుకు ఉన్న మన దేశ జనాబాలో... నా వల్ల పోయే ఆ రెండు ప్రాణాలు ఎవరికి అవసరం చెప్పండి? 

కాబట్టి... మీరంతా రోగం ఉన్నా లేకపోయనా మా  గట్టిగా చావండి (Die Hard) హాస్పిటల్స్ వచ్చి అవసరం ఉన్నా లేక పోయినా మా బావమరిది డయాగ్నొస్టిక్ సెంటర్ లో టెస్ట్స్ చేయించుకుని, నేను నాకు ఖాళీ ఉన్నప్పుడు ఇచ్చే అమృతతుల్యమైన మందులు (ఆ మందు కాదండోయ్!) మరియు మాత్రలు తీసుకుని, నన్ను బిలియనియర్ని కాకపోయినా మిలియనియర్ని చేసేయమనివిజ్ఞప్తి చేసుకుంటున్నాను.


Image source:
http://www.dreamstime.com/royalty-free-stock-images-set-ghosts-image18025459





5 comments:

  1. నాకు ఈ డాక్టర్ మాబాగా నచ్చేసారుకదా:-) ఫీజు మాత్రం ఐదంక్కెలకి తగ్గితే నేనిచ్చుకోలేను...

    ReplyDelete
  2. naya doctor zindabad...

    ReplyDelete
  3. మీకు టపాలు రాయడంలో అనుభవం ఉందా ? అది ముందు చెప్పండి? :))
    బాగుందండి మీ టపా వెరైటీ గా!

    ReplyDelete
  4. డాక్టర్ కావాలని ఈ పద్ధతిలో అనుకుంటే లాభం లేదండి.:P
    పనిలో పనిగా అందరి పైన వేసిన సెటైర్లు బావున్నాయి

    ReplyDelete
  5. కామెంటిన అందరికీ ధన్యవాదాలు!
    @ పద్మార్పిత – మా హాస్పిటల్ మొదటి విజిటర్ మీరేనన్నమాట. మీకు ధైర్యం పాళ్ళు కొంచెం ఎక్కువేనండి. వైద్యం విషయంలో హామీ ఇవ్వలేను కాని ఫీజు విషయంలో మీ నమ్మకాన్ని వమ్ము చేయం.
    @ జలతారువెన్నెల – మీరు మరీ అంత సూటిగా అడిగిస్తే....లేనట్టే. రాస్తే పోయేదేముంది చదివేవాళ్ళ బుర్రలు తప్ప అని ఇప్పుడిప్పుడే అనుభవం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాను.
    @ చిన్ని - శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నారు కదాండి. అందుకని...... :)

    ReplyDelete

వినదగు నెవ్వరు చెప్పిన!
సందర్శకులందరకీ హృదయపూర్వక ధన్యవాదములు.

Thanks for stopping by. I would love to hear about your thoughts and welcome healthy discussions. But please do not use profane or abusive language.